
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి గంగరేగు చెట్టు వద్ద శ్రీ కృష్ణ, గొల్లభామ వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమన్ని నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఊరేగించారు. ఆలయ ముఖమండపంలో 25 వరుసలతో పట్నం వేసి బోనం సమర్పించారు.
అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పట్నం మధ్య చేర్చి పంచవర్ణ రంగులతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం దాటుతూ వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. - కొమురవెల్లి, వెలుగు