బడేమియా.. చోటేమియా

బడేమియా.. చోటేమియా

చాలా యేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్, గోవిందాల కాంబినేషన్‌‌లో ‘బడేమియా చోటేమియా’ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్‌‌తో అక్షయ్‌‌ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా ఓ మూవీ రూపొందుతోంది. అలీ అబ్బాస్ జాఫర్‌‌‌‌ దర్శకత్వంలో వశు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌‌శిఖా దేశ్‌‌ముఖ్ నిర్మిస్తున్నారు. బిగ్‌‌ బీ, గోవిందాలు చేసింది కామెడీ ఫిల్మ్ అయితే.. ఇప్పుడీ హీరోలిద్దరూ చేస్తోంది కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌. అందుకు తగ్గట్టే నిన్న విడుదల చేసిన అనౌన్స్‌‌మెంట్ టీజర్‌‌‌‌లో హీరోలిద్దరూ యాక్షన్ మోడ్‌‌లో కనిపించారు. తమ సినిమా టైటిల్‌‌ని రివీల్ చేయడంతో పాటు 2023 క్రిస్మస్‌‌కి రిలీజ్‌‌ అని కన్‌‌ఫర్మ్ కూడా చేశారు.