రూ.499కే క్షేమ పంట బీమా పథకం

రూ.499కే క్షేమ పంట బీమా పథకం

హైదరాబాద్​, వెలుగు :  క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, భారతదేశంలోని 20 రాష్ట్రాలు,  రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధాన పంట బీమా పథకం సుకృతిని అందుబాటులోకి తెస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.  ఎకరాకు బీమా చేయించుకోవడానికి రూ. 499కి మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. రుతుపవనాల రాకతో అన్ని ముఖ్యమైన ఖరీఫ్ పంటలు విత్తే కాలం మొదలవుతున్నందున

ఈ బీమా ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.  సుకృతిని కొనుగోలు చేయడానికి క్షేమ యాప్‌‌‌‌లోకి లాగిన్ కావాలి. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడి, విమానాల వల్ల పంటనష్టం కలిగితే పరిహారం పొందవచ్చని క్షేమ తెలిపింది. 
 

మరిన్ని వార్తలు