
కరోనా బారినపడిన మంత్రి హరీశ్ రావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తనకు కొద్దిపాటి సింప్టమ్స్ ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా వచ్చిందని మంత్రి హరీష్ రావ్ ట్వీట్ చేశారు. దానికి స్పందించిన మంత్రి కేటీఆర్.. హరీష్ రావ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ‘గెట్ వెల్ సూన్ బావా.. నువ్వు తప్పకుండా అందరి కంటే త్వరగా కోలుకుంటావు’ అని ట్వీట్ చేశారు.
మంత్రి హరీష్ రావ్‌కు కరోనా సోకిందన విషయం తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు.
Get well soon Bava. I am sure you’ll recover faster than others ? https://t.co/nq1hVnMkz6
— KTR (@KTRTRS) September 5, 2020
అదేవిధంగా మాజీ ఎంపీ, కేటీఆర్ సోదరి కవిత కూడా హరీష్ రావ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘మా ప్రార్థనలన్నీ మీతో ఉన్నాయి బావా. మీరు దృఢమైన సంకల్ప శక్తితో కరోనా నుంచి కోలుకోని.. కరోనాను ఓడిస్తారు’అని ఆమె ట్వీట్ చేశారు.
All our prayers are with you Bava. With your resolute will power, you will soon come out of this and defeat Coronavirus. https://t.co/pwq17kGCM4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 5, 2020
For More News..