
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ద్యానబోయిన నర్సింలు బీఆర్ఎస్ కార్యకర్త. ఈయన గతంలో కరోనాతో చనిపోయారు. నర్సింలు కూతురు నవిత వివాహం ఆదివారం జరగగా కేటీఆర్ హాజరై ఆమెను ఆశీర్వదించారు.
నవిత తండ్రి కరోనా సమయంలో, అన్న యాక్సిడెంట్‌లో చనిపోగా.. కార్యకర్తల కుటుంబానికి అండగా ఓ అన్నగా హాజరయ్యాయని కేటీఆర్ చెప్పారు. అలాగే తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య బిడ్డ పెండ్లికి హాజరయ్యారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో సోని పవర్ సోలార్ సెంటర్‌ను ప్రారంభించారు.