లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్

లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్

ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముందుగా అష్టలక్ష్మీ అమ్మవారిని వారు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. 11.75 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడీ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రఘునాథపాలెంలో సుడా నిధులతో నిర్మించిన  పార్క్ను ప్రారంభించారు.