కేసీఆర్.. కల్వకుంట్ల కమీషన్ రావుగా మారిపోయారు

కేసీఆర్.. కల్వకుంట్ల కమీషన్ రావుగా మారిపోయారు

హైదరాబాద్: రాష్ట్ర సీఎం కేసీఆర్.. కల్వకుంట్ల కమీషన్ రావుగా మారిపోయారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ టీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్లమెంట్‌‌లో 7 స్థానాలు కోల్పోయారని, రీసెంట్‌‌గా దుబ్బాకలోనూ అధికార పార్టీ ఓటమి మూటగట్టుకుందని వివేక్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను బట్టి కేటీఆర్ నాయకత్వ సమర్థత ఏంటో తెలుస్తుందన్నారు.

‘కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమీషన్ రావుగా మారిపోయారు. నగరంలో వరదలు వస్తే సీఎం కేసీఆర్ మాత్రం కమీషన్‌‌లు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. వరద సాయంలో బాధితులకు 5 వేలే ఇచ్చి టీఆర్‌‌ఎస్ నేతలు ఐదు వేలు నొక్కేశారు. అదే డబ్బులను ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. గ్రేటర్ ప్రజలు టీఆర్‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా ఉన్నారు. మొక్కజొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం మెడలు వంచాం. అలాగే ఎల్ఆర్‌‌ఎస్ కూడా రద్దు చేయిస్తాం’ అని వివేక్ పేర్కొన్నారు.