
చట్టాలను మార్చాల్సిన టైమ్ వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. IPC, CRPCలను మార్చాలని ప్రధాని మోడీని కోరుతూ వరుస ట్వీట్లు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు ఆలస్యం లేకుండా అమలు చేసేలా చట్టాలుండాలన్నారు. రివ్యూ చేయడానికి ఆప్షన్ ఉండకూడదన్నారు. చట్టం, న్యాయానికి భయపడని మృగాల నుంచి దేశాన్ని కాపాడేందుకు వేగంగా పనిచేయాలని కోట్ల మంది ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఏడేళ్ల క్రితం నిర్భయ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషులను ఇప్పటికీ ఉరితీయకపోవడాన్ని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మధ్యే 9 నెలల చిన్నారి రేప్ కేసులో దోషికి లోయర్ కోర్టు మరణశిక్ష విధించినా… హైకోర్టు దానిని యావజ్జీవ శిక్షగా మార్చిన విషయం గుర్తు చేశారు. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ను క్రూరంగా రేప్ చేసి చంపారని మోడీకి తెలిపారు. దోషులను అరెస్ట్ చేసినా… న్యాయం కోసం రోధిస్తున్న వెటర్నరీ డాక్టర్ కుటుంబసభ్యులను మనం ఎలా ఓదార్చగలమన్నారు. న్యాయాన్ని ఆలస్యం చేస్తే… అన్యాయం చేసినట్టేనన్నారు కేటీఆర్. పార్లమెంట్ సెషన్ జరుగుతున్నందున… వెటర్నరీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును ప్రాధాన్యతా అంశంగా ఒక రోజు మొత్తం చర్చకు తీసుకోవాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు కేటీఆర్.