నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు

నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు

ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడిన వివాదం అవుతోంది. ట్వీట్లు, కామెంట్స్ తో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు మంత్రి కేటీఆర్. మొన్న కర్నాటక, ఇప్పుడు ఏపీపై ఉద్వేగాలు రేపే కామెంట్స్ చేశారు. ఏపీలో రోడ్లు, కరెంట్, నీళ్లు లేవంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. దీంతో నిన్నంతా.. కేటీఆర్.. ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన కేటీఆర్.. తన వ్యాఖ్యల వెనక దురుద్దేశం లేదని.. ఏపీ సీఎంతో సోదరభావం కలిగి ఉన్నామన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

అంతకుముందు కర్ణాటకలో మౌలిక సదుపాయాలు లేకుంటే తెలంగాణ వచ్చేయాలంటూ కేటీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. కౌంటర్ ఇచ్చారు. 40 శాతం FDAలు  కర్ణాటకకే ఉన్నాయని చెప్పారు. సాఫ్ట్ వేర్ రంగంలో తామే ఎక్కువ అభివృద్ధి సాధించామన్నారు కర్ణాటక సీఎం. ప్రధాని టూర్ సమయంలో.. పీఎంఓ వద్దన్నదంటూ.. కేటీఆర్ నేషనల్ మీడియాకు చెప్పడం కూడా వివాదమైంది. సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ పాటించలేదంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. అబద్ధాలు చెప్పారంటూ విమర్శించినా…. కేటీఆర్ అందుకు బదులివ్వలేదు. అలాగే టెస్లా.. కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ కు.. విదేశీ విధానాలపై అవగాహన లేదంటూ కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు వరుస ట్వీట్లు చేశారు.