Kuberaa Collection: తొలిరోజే దుమ్ముదులిపిన కుబేర.. పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వసూళ్లలో దూకుడు ..

Kuberaa Collection: తొలిరోజే దుమ్ముదులిపిన కుబేర.. పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వసూళ్లలో దూకుడు ..

ధనుష్, నాగార్జున, రష్మిక కలిసి నటించిన కుబేర పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే (JUNE20) వసూళ్లతో దుమ్మురేపింది.

కుబేర తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.13కోట్ల నెట్ వసూళ్ళు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.19 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నేడు, కాసేపట్లో గ్రాస్ వసూళ్లు ఎంతనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తర అమెరికాలో రూ.7 కోట్లకి పైగా వసూళ్లు సాధించి, దూసుకుపోతోందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

కుబేర బాక్సాఫీస్:

ట్రేడింగ్ వెబ్ సైట్ Sacnilk.com ప్రకారం, కుబేరా సినిమాకు ఫస్ట్ డే మంచి స్పందన వచ్చింది. తెలుగు ప్రాంతాల్లో సగటున 50.19% ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. ఉదయం షోలు 38.94% వద్ద నెమ్మదిగా మొదలైంది. కానీ, ప్రేక్షకుల సంఖ్య మధ్యాహ్నం 54.58%కి క్రమంగా పెరిగింది. అది కాస్తా సాయంత్రం నాటికి 57.04%కి చేరుకుంది. ఇక నైట్ షోస్ లో ఏకంగా 78.87% ఆక్యుపెన్సీ నమోదైంది.

తెలుగు వెర్షన్ స్పందన:

హైదరాబాద్ 530 షోలలో అత్యధిక ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసుకుంది.  వరంగల్ (34 షోలలో 67.50%), వైజాగ్-విశాఖపట్నం 158 షోలలో 53% ఆక్యుపెన్సీ,  విజయవాడ (117 షోలలో 56.00%) మరియు కాకినాడ (28 షోలలో 69.75%) ఉన్నాయి. బెంగళూరులో కుబేర తెలుగు వెర్షన్ 316 షోలకు 35.25% ఆక్యుపెన్సీ కనిపించింది.

సోషల్ మీడియా స్పందన:

ధనుష్ నటించిన బిచ్చగాడి పాత్రకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. రష్మిక మరియు నాగార్జున స్క్రిప్ట్‌ల ఎంపికకు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఏదేమైనా, తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో.. ఈ వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు సాధించడం కన్ఫార్మ్!

కుబేర కథ:

ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్‌ (జిమ్‌ సర్ఫ్‌) లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్‌ నిక్షేపాలను తనకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలతో లక్ష కోట్ల డీల్ సెట్ చేసుకుంటాడు. అంత భారీ మొత్తం చేతులు మార్చడానికి మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున) సహాయం కొరతారు. దీపక్ స్వతహాగా సిన్సియర్ ఆఫీసర్ అయినప్పటికీ అక్రమ కేసుల్లో జైలు పాలవడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అందుకు అంగీకరిస్తాడు. జైలు నుంచి విడుదలైన దీపక్.. లక్ష కోట్ల బదిలీ కోసం బినామీలుగా నలుగురు బిచ్చగాళ్ళను ఎంపిక చేస్తాడు. తిరుపతిలో బిక్షం ఎత్తుకుంటున్న దేవా (ధనుష్) అందులో ఒకడు. దేవా పేరుపై బినామీ కథలు ఓపెన్ చేసి పదివేల కోట్లు జమ చేస్తారు. కానీ ఆ తర్వాత దేవా వాళ్ల నుంచి తప్పించుకుని పోతాడు. అతని ఎందుకు తప్పించుకున్నాడు.. దీపక్ ప్లాన్ వర్కౌట్ అయిందా.. ఇందులో సమీర (రష్మిక) పాత్ర ఏమిటి.. అసలు ఈ బిచ్చగాడు కథకు 'కుబేర' టైటిల్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.