
సోషల్ మీడియా వచ్చాక రకరకాల ఫుడ్ ఐటమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఫుడ్ ఫ్యూషన్ పేరుతో కొత్త రకాల వంటకాలను సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి అత్యంత విచిత్రమైన ఆహారాలు తినడానికి ఎలా ఉన్నా, చూడడానికి మాత్రం కాసేపు ఎంటర్టైన్ గానే ఉంటాయి. మొన్నటి వరకు ‘బిర్యాని సమోసా’ బాగా వైరల్ అయింది. సమోసాలో బిర్యాని పెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇంకా రకరకాల సమోసాలు చూడటానికి చాలా వింతగా ఉన్నాయి. ఇప్పుడు పాస్తా సమోసా Instagramలో భారీగా ప్రచారం అవుతుంది.
భారతీయులు చిరుతిండి అంటే లొట్టలేసుకుంటారు. ఇప్పుడు ఇటాలియన్ పాస్తా సమోసా “జస్టిస్ ఫర్ సమోసా” ప్రచారం Instagramలో వైరల్ అవుతుంది. ఆన్‌లైన్-ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గి లో కూడా ఈ సమోసా అందరి దృష్టిని ఆకర్షించింది. హాస్యాస్పద వస్తువు వీడియోను ఒకరు డీప్-ఫ్రైడ్ ట్రయాంగిల్-ఆకారపు చిరుతిండి కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
మసాలాతో బంగాళాదుంప, బఠానీలతో సాధారణంగా సమోసాలను తయారుచేస్తారు. ఈ విపరీతమైన వంటకం లోపలి భాగం సమోసా ప్రేమికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. వీడియోలో ఎరుపు రంగు మాకరోనీని రికార్డ్ చేశారు. ఇటాలియన్ అయినప్పటికీ, పాస్తా ఫిల్లింగ్ బఠానీలను కలిపి భారతీయ శైలిలో వండినట్లు కనిపిస్తుంది. “కహా గ్యా ఆలూ కో ధుంధో (బంగాళాదుంప ఎక్కడికి పోయింది, దయచేసి ఎవరైనా దాన్ని కనుగొనండి) అని ఈ క్లిక్లిప్ కు ఫన్నీ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు.
పాస్తా సమోసా Swiggy దృష్టిని ఆకర్షించింది. వెంటనే, కంపెనీ పోస్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు. "కుచ్ తో షరమ్ కరో జనాబ్ (కొంత సిగ్గుపడండి సార్)" అని కంపెనీ పేర్కొంది. సమోసా ప్రియుల హిస్టీరికల్ రియాక్షన్స్‌ని హాస్యాస్పదంగా మార్చింది. ఒక యూజర్ "భారతీయ మరియు ఇటాలియన్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు." మరొకరు, “యే యార్ హుమారీ ఫేవరెట్ చిజోన్ కో హై క్యు టార్గెట్ కర్ రహే హై (వారు మనకు ఇష్టమైన వాటిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు).” అన్నారు. ఇంకొరు ఈ రోజుల్లో వీధి వ్యాపారులు శాస్త్రవేత్తల కంటే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారని కామెంట్లు పెట్టారు.
గతంలో కూడా విచిత్రమైన ఫుడ్ ఫ్యూజన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒకటి గులాబ్ జామూన్ బర్గర్. బర్గర్ల మధ్య గులాబ్ జామూన్లు పెట్టి ఇస్తారు. ఇదే దాని ప్రత్యేకత. మరోసారి ఒరియో ఆమ్లెట్ కూడా వైరల్ అయ్యింది. ఓరియో బిస్కెట్లను పిండిలా చేసి, గుడ్లు, చాక్లెట్ సిరప్ వేసి ఆమ్లెట్లా వేస్తారు. ఇది నెటిజన్లను చాలా ఆశ్చర్యపరిచింది. టీతో ఐస్ క్రీమ్ కూడా నెటిజన్లకు చిరాకు తెప్పించిన ఆహారం. టీలో ఐస్ క్రీమ్ కలిపి అమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు పాస్తా సమోసా కూడా వైరల్ అయింది.