
జైనూర్, వెలుగు: జైనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోందని వెంటనే సమస్య పరిష్కరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు.
నాలుగు మండలాల ప్రజలు వైద్యం కోసం ఇక్కడికే వస్తున్నప్పటికీ, అరకొర సిబ్బందితోనే పీహెచ్‌సీ నడుస్తుందని, దీంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒకే డాక్టర్‌తో వైద్యం కొనసాగించడం సాధ్యపడడం లేదని పేర్కొన్నారు. వెంటనే స్టాప్ ను నియమించాలని కోరారు.