మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన కోర్టు

మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన కోర్టు

ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ తీస్ హజారీ న్యాయస్థానం బీజేపీ బహిహ్కృత ఎమ్మెల్యే కుల్దీఫ్ సింగార్ దోషేనని ప్రకటించింది.  కుల్దీఫ్ జూన్ 4,2017న బాలికను కిడ్నాప్ చేసి, పలుమార్లు రేప్ చేసినట్ల ఆరోపణలు వచ్చాయి. కుల్దీప్ తో పాటు మరో ముగ్గురు అత్యాచారం చేసినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన తీస్ హాజారీ కోర్ట్ కుల్దీఫ్ ను దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో డిసెంబర్ 19న కుల్దీప్ కు శిక్ష ఖరారు చేయనుంది.

2017 నుంచి అత్యాచారం కేసుపై పోరాటం చేస్తున్నట్లు, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ  బాధితురాలు సీఎం యోగి  నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

కుల్దీప్ పై కేసు పెట్టారనే అకారణంగా ఆయన సోదరుడు తన  తండ్రిని చెట్టుకు కట్టేసి బహిరంగంగా కొట్టారని  చెప్పింది. దీంతో యోగి చొరవతో కేసు నమోదైంది.

దీంతో కుల్దీప్ ను సీబీఐ అధికారులు అదులోకి తీసుకున్నారు.  మహిళల అపహరణ, అత్యాచారం, నేరపూరిత బెదిరింపులపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ కేసులో సీబీఐ పై విమర్శలు వెల్లువెత్తాయి. సీబీఐ అధికారులు కేసును పారదర్శకంగా విచారణ చేయడం లేదంటూ  ఢిల్లీ హైకోర్ట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ నుంచి కేసును కోర్ట్ బదిలీ చేసింది. కేసుపై విచారణ చేపట్టిన తీస్ హాజారీ న్యాయ స్థానం కుల్దీప్ దోషిగా ప్రకటించింది. 19న ఈ కేసులో శిక్షను ఖరారు చేయనుంది.