
మీది మొత్తం థౌజెండ్ అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా.. ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను దున్నేశారు కుమారి ఆంటీ(Kumari Aunty). హైదరాబాద్ లోని ఒక ప్లేస్ లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా ఎదిగారు. పైన చెప్పిన ఒకే ఒక డైలాగ్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలా ఎక్కడ చూసినా ఆమె ఫుడ్ వీడియోసే దర్శనమిచ్చాయి. అలా.. ఒక్కదెబ్బతో సోషల్ మీడియాను తన వైపుకు తిప్పుకున్నాడు కుమారి ఆంటీ.
ఎంతలా అంటే.. ఒకప్పుడు ఆమె బిజినెస్ చేసుకునే చోట ఎవ్వరు కనిపించేవారు కాదు.. అలాంటిది ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ ఫుల్లుగా పెరిగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ను మిసేయాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పగా.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దానిపై స్పందించే స్థాయికి ఆమె చేరుకున్నారు. ఇక ఆ క్రేజ్ తో టీవీలో కూడా ఎంట్రీ ఇచ్చారు కుమారి ఆంటీ. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు అన్నింటిలో కనిపించేశారు కుమారి ఆంటీ.
ఇక ఇప్పుడు షోస్ అన్నీ దాదాపు కవర్ అవడంతో సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె జీ తెలుగులో ప్రసారమవుతున్న..రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్.. సీరియల్ లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వరలో ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ప్రోమోలో ఆమె చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. అంతేకాదు.. మా కుమారి ఆంటీతో మాములుగా ఉండదు మరి, కుమారి ఆంటీనా మజాకా. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కుమారి ఆంటీ కనిపించిన సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.