తెలుగులో ఆ మధ్య ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించినగుంటూరు కారం చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ కుర్రకారుకి తెగ నచ్చేసింది. దీంతో రీల్స్ లో అలాగే ప్రవైట్ పార్టీలలో స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.
అయితే ఈ పాటలో ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ పూర్ణ నటించింది. కుర్చీ సాంగ్ విడుదలయిన సమయంలో నటి పూర్ణ కొంతమేర బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కొంది. అయితే నటి పూర్ణ ఈ బాడీ షేమింగ్ కామెంట్లు గురించి స్పందించింది.
ALSO READ | Krithi Shetty: మీటూ ఉద్యమంపై స్పందించిన స్టార్ హీరోయిన్.
ఇందులో భాగంగా తన బిడ్డకి జన్మనిచ్చిన 8 నెలలకే కుర్చీ మడతపెట్టి సాంగ్ లో నటించానని చెప్పుకొచ్చింది. అయితే ప్రసవం తర్వాత తాను బరువు పెరిగానని దాంతో తాను ఈ సాంగ్ లో నటించడానికి అర్హురాలినా కాదా ఒకటికి రెండు సార్లు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ని అడిగానని తెలిపింది.
ఈ క్రమంలో ఈ పాటలో డాన్స్ తోపాటు ఎక్సప్రెషన్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా సాంగ్ షూట్ లో పాల్గొనమని చెప్పి తనని ప్రోత్సహించారని తెలిపింది. అయితే సోషల్ మీడియాలో ఈ పాట మంచి హిట్ అయినప్పటికి కొందరు తనపై బాడీ షేమింగ్ కామెంట్లు చేసారని దాంతో కొంతమేర నిరాశ చెందినట్లు చెప్పుకొచ్చింది.