
తెలంగాణ నుండి రాయలసీమ కు అక్రమంగా తరలిస్తున్న చీప్ లిక్కర్ ను సీజ్ చేశారు కర్నూల్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీసులు. తుంగభద్ర నది ఒడ్డున.. కర్నూలు- కడప కాలువ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. నందికొట్కూరు మండలం అల్లూరు కె.సి కాలువ వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తెస్తున్న 650 చీప్ లిక్కర్ బాట్టిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అపరేషన్ లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవ్ రావు, ఎక్సైజ్ ఎక్ససైజ్ సి.ఐ. నాగసునిత రాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు.