ఖుషి రివ్యూ..బొమ్మ హిట్టా..ఫట్టా.. ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదే

ఖుషి రివ్యూ..బొమ్మ హిట్టా..ఫట్టా.. ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదే

నా సఖివి నువ్వేలే..నీ దళపతిని నేనేనంటూ  సమంతతో తొలిసారి  జోడి కట్టిన విజయదేవరకొండ..ఖుషీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత హిట్టు కోసం తహతహలాడుతున్న విజయ దేవరకొండ .. ఖుషి  సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం ఖుషి మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.  మరి రౌడీ హీరో ఖుషితో హిట్టు కొట్టాడా..ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యాడా..చూసేద్దాం..

కథేంటంటే..

ఖుషి మూవీ...జమ్మూ కాశ్మీర్‌లో స్టార్ట్ అవుతుంది. కశ్మీర్ లో  బేగం(సమంత) పేరుతో పిలవడబడుతున్న ఆరాధ్యను  చూసి విప్లవ్ ( విజయ్ దేవరకొండ ) ప్రేమలో పడిపోతాడు.  ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు.  అనూహ్య పరిస్థితుల్లో బేగం  బ్రాహ్మిణ్ అని తెలుస్తుంది. ఆమె అసలు పేరు ఆరాధ్య  అని తెలుసుకుంటాడు. ఆరాధ్యను పెళ్లి చేసుకునేందుకు  పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్యను నాస్తిక కుటుంబానికి చెందిన విప్లవ్ కు ఇచ్చి వివాహం చేసేందుకు  చదరంగం శ్రీనివాస రావు (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో  పెద్దలను ఎదరించి మరీ విప్లవ్ (విజయదేవరకొండ), ఆరాధ్య (సమంత)ను  పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది.

పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని..

ఆరాధ్యను వివాహం చేసుకుంటే సుఖంగా ఉండలేరని..వారికి గండం ఉందని..దాని ద్వారా కాపురంలో సమస్యలు వస్తాయని ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాస రావు  (మురళీశర్మ)  హెచ్చరిస్తాడు.  అయినా విప్లప్, ఆరాధ్య పట్టించుకోకుండా ..చదరంగం శ్రీనివాస రావు మాటలకు భిన్నంగా..కలిసి సుఖంగా బతకాలని..వరల్డ్ లోనే మన జంట అందమైన, సంతోషంగా బతుకుతున్న జంట అని నిరూపించాలని విప్లవ్ తో  వచ్చేస్తుంది  ఆరాధ్య. అయితే కొత్తగా పెళ్లయింది. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం  కొత్త మలుపులు తిరుగుతుంది. అయితే తమ సమస్యలను పరిష్కరించుకున్నారా..? అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి..?  చివరికు విప్లవ్, ఆరాధ్య కలిన్నారా..విడిపోయారా..? అన్నదే  ఖుషి సినిమా మిగిలిన స్టోరీ..

నిన్ను కోరి, మజిలీ వంటి క్యూట్ చిత్రాలతో శివ నిర్వాణ టాలీవుడ్ లో  తనదైన మార్క్ వేశారు.  ఈ రెండు సినిమాల్లోనూ దర్శకుడు ప్రేమ కథను సరికొత్త యాంగిల్‌లో చూపించాడు.  ఈ క్రమంలోనే ఖుషి చిత్రాన్ని సైతం అలాంటి ఓ వైవిధ్యభరితమైన కథాంశతోనే తెరకెక్కించారని చెప్పొచ్చు.  పెళ్లి తర్వాత జంటల మధ్య తలెత్తే చిన్న  చిన్న వివాదాలు, గొడవలు.. వారి మధ్య ఉండే ఎమోషనల్‌ బాండింగ్స్‌ను ఖుషిలో డైరెక్టర్ శివ నిర్వాణ చూపించే ప్రయత్నం చేశారు.

ప్రేక్షకులకు నచ్చిందా లేదా..?

ఖుషి మూవీ గురించి ప్రేక్షకులు  తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఖుషి సినిమా పేరుకు తగినట్టుగానే ఖుషిగా ఉందని కొందరు చెబుతున్నారు.  అయితే ఫస్టాఫ్ లో కనిపించే లవ్ సీన్లు, కామెడీ సూపర్ గా వర్కౌట్ అయిందంటున్నారు.  వీటికి పాటలు మరింతగా ప్లస్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగినట్టుగా ఉందని అంటున్నారు. అయితే సెకండాఫ్ లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావని.. కాకపోతే మిగతా సీన్లు అందరినీ ఆకర్షిస్తాయని చెబుతున్నారు. 

మణిరత్నం సఖిలెక్క ..

ఖుషి సినిమాను కొందరు ప్రేక్షకులు మణిరత్నం సఖి సినిమాతో పోల్చుతున్నారు. ఖుషి సినిమా చూస్తుంటే సఖి సినిమా ఫీల్స్ కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.  సఖి సినిమా చూసిన వారికి ఖుషి సినిమా మరింత కనెక్ట్ అవుతుందని అంటున్నారు. సమంత, విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌ అంటూ చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా చూస్తే ఖుషి సినిమా లెంగ్త్  కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కానీ ఖుషి  మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.