- డ్రగ్స్ సప్లై కేసులో తీర్పు వెలువరించిన ఆ దేశ కోర్టు
కువైట్: డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఇద్దరు ఇండియన్లకు కువైట్ కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులు హెరాయిన్, మెథాంఫెటమైన్‌ను సప్లై చేస్తున్నట్లు డ్రగ్ అధికారులు గుర్తించారు. దేశంలో డ్రగ్స్ కట్టడికి చర్యలు చేపట్టిన ఆ దేశం.. కైఫాన్, షువైఖ్ ప్రాంతాల్లో నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఇండియాకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ సప్లై చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి దగ్గరి నుంచి 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటైమన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ వెయింగ్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
నిందితులకు ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో వారికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
