క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో... కమిషనర్, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ భర్త మధ్య వివాదం

క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో... కమిషనర్, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ భర్త మధ్య వివాదం
  •   పోలీసులకు పరస్పర ఫిర్యాదులు 

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్​ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురళీకృష్ణ, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ సంధ్యారాణి భర్త రాజారమేశ్​ మధ్య వివాదం పోలీస్​స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో వార్డుల్లో సమస్యలు తెసుకునేందుకు బుధవారం ఉదయం కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన సిబ్బందితో పర్యటించారు. ఒకటో వార్డులో కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం పర్యటిస్తుండగా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ భర్త రాజారమేశ్​, బీఆర్ఎస్​ లీడర్​రామిడి కుమార్, ఇతరులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్​ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అత్యవసర విధులు నిర్వహిస్తున్న తనకు, సిబ్బందికి ఆటంకం కలిగించడంతో పాటు అసభ్యకరంగా బూతులు తిడుతూ అంతుచూస్తానని చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ భర్త రాజారమేశ్​ బెదిరించాడని, ఆయనపై చర్య తీసుకోవాలంటూ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ,  దళిత మహిళ అయిన చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​, వార్డు కౌన్సిలర్లను అవమానిస్తూ, కుల వివక్షతో మాట్లాడి భౌతిక దాడికి దిగిన కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలంటూ రాజారమేశ్ సైతం ఫిర్యాదు చేశాడు. అనంతరం కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్​చేయాలంటూ మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు చెందిన బీఆర్​ఎస్​ లీడర్లు, కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. పోలీసులు క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. కాగా మున్సిపల్​ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజారమేష్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల దాడిని కాంగ్రెస్​ లీడర్లు ఖండించారు. రామకృష్ణాపూర్​లోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో టౌన్​ ప్రెసిడెంట్​ వొడ్నాల శ్రీనివాస్​, మాజీ జడ్పీటీసీ యాకుబ్​అలీ, లీడర్​ గోపు రాజం మాట్లాడుతూ  గతంలో ఎన్నడూ ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు, బెదిరింపులు, రాజకీయ దౌర్జన్యాలు జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జోక్యంతోనే ఇలాంటి సంఘటనలు జరగుతున్నాయని  ఆరోపించారు. ----