Smriti Irani : 'క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ' సీజన్ 2: తులసిగా స్మృతి ఇరానీ రీఎంట్రీ!

Smriti Irani : 'క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ' సీజన్ 2: తులసిగా స్మృతి ఇరానీ రీఎంట్రీ!

దాదాపు 25 సంవత్సరాల  క్రితం భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన సీరియల్  "క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" ( Kyunki Saas Bhi Kabhi Bahu Thi).  ఈ సీరియల్‌లో  ఒక మెరూన్ చీరలో, నుదిటిన పెద్ద బొట్టుతో కూడిన ఒక స్త్రీ భారతదేశ టెలివిజన్‌కు సరికొత్త నిర్వచనం చెప్పింది. ఆమె పేరు తులసి విరానీ. ఇంటింటికీ తెలిసిన పేరు ఈ పేరు  మహిళలందరికీ ఆరాధ్య దైవంగా, భారతీయ సంస్కృతికి ప్రతీక నిలిచింది. ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని చూరగొంది. కాలం మారినా  కానీ తులసి ప్రాభవం మాత్రం తరగలేదు.  ఇప్పుడు, ఆ ఐకానిక్ పాత్ర మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సీరియల్  రీబూట్‌తో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ( Smriti Irani ) తిరిగి బుల్లితెరపై కన్పించేందుకు సిద్ధమయ్యారు.  ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" సీజన్ 2
తాజాగా "క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" సీజన్ 2 మొదటి లుక్ విడుదల విడుదలైంది.  ఈ లుక్ లో  ఎప్పటిలాగే స్మృతి ఇరానీ తిరిగి తులసిగా కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  తన మార్క్ మెరూన్ రంగు చీరలో, బంగారు బుటీలు, రిచ్ జరీ బోర్డర్‌తో మెరిసిపోతున్నారు. ఆమెకు సరిపోయేలా, పెద్ద ఎర్రటి బొట్టు, సాంప్రదాయ టెంపుల్ జ్యువెలరీ, నల్లపూసల మంగళసూత్రం, వరుస గాజులతో మంచి లుక్‌లో ఉంది.  ఇది 2000 సంవత్సరం ప్రారంభంలోని టెలివిజన్ ఫ్యాషన్‌కు అచ్చమైన ప్రతీకగా నిలుస్తోందంటున్నారు అభిమానులు. ఆమె రూపం, ఆ గంభీరమైన కళ్ళు, అన్నీ యధావిధిగా శక్తివంతంగానే ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.

స్మృతి ఇరానీ పునరాగమనం!
సుదీర్ఘ వీరామం తర్వాత నటనా రంగంలోకి పునారాగమనంపై స్మృతి ఇరానీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది "క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" సీజన్ 2  కేవలం ఒక షో మాత్రమే కాదు .. మనందరి జ్ఞాపకం. ఇది ఎప్పటికీ  మన హృదయాల్లో సజీవంగా ఉంటుంది.  ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కొత్త సీజన్  షూటింగ్ జూలై 4న ప్రారంభమైంది.  మిహిర్ పాత్రధారి అమర్ ఉపాధ్యాయ్ కూడా తిరిగి నటించడం అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.  తులసి, మిహార్ జోడీ మళ్లీ తెరపై కనిపింబోతుండటంతో కథపై వారిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కుంటుంబ విలువలు, బంధాల ప్రాధాన్యత.
దేశ రాజకీయాల్లో విజయం సాధించి, ప్రజల నాయకురాలిగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీమంత్రి  స్మృతి ఇరానీ తిరిగి నటనలోకి రావడం ఈ సీరియల్‌కు మరింత భావోద్వేగ భారాన్ని చేకూరుస్తుండనంలో సందేహం లేదని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తులసి కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె బలం, సంప్రదాయం, స్థిరత్వానికి ప్రతీక అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె తిరిగి రావడమంటే కేవలం ఒక కథను తిరిగి తీసుకురావడం కాదు, ఒక యుగాన్ని తిరిగి తీసుకురావడం అని ప్రశంసిస్తున్నారు. ఆనాటి కుంటుంబ విలువలు, బంధాల ప్రాధాన్యతను నేటి తరానికి కూడా చూపించాలన్న లక్ష్యంతో పెట్టుకుని ఈ  "క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" సీజన్ 2 రూపొందిస్తున్నామని  మేకర్స్ వెల్లడించారు.