
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) గురువారం (june 19) డిబెంచర్ల ద్వారా రూ.500 కోట్లు సేకరించినట్లు తెలిపింది. ఇందుకోసం కంపెనీ గురువారం రూ.లక్ష విలువైన 50 వేల లిస్టెడ్, రేటెడ్, అన్‌సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లను (ఎన్‌సీడీలు) జారీ చేసింది. వీటి విలువ రూ. 500 కోట్లకు సమానమని ఎల్ అండ్ టీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ ఎన్‌సీడీలు జూన్ 19, 2028న మెచ్యూర్అవుతాయి. వడ్డీని ఏడాది ప్రాతిపదికన చెల్లిస్తారు. ఈ డిబెంచర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లిస్టవుతాయి. మార్చి 31, 2025తో ముగిసిన క్వార్టర్లో లార్సెన్ అండ్ టూబ్రో నికరలాభం ఏడాది లెక్కన 25 శాతం పెరిగి రూ.5,497 కోట్లకు చేరుకుంది.
గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.4,396 కోట్ల లాభాన్ని సాధించింది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం ఏడాది క్రితం రూ.67,078.68 కోట్ల నుంచి రూ.74,392.28 కోట్లకు పెరిగింది.