తిండి లేక కుక్కలు, పిల్లులు పరేషాన్

తిండి లేక కుక్కలు, పిల్లులు పరేషాన్

అథెన్స్ : కరోనా ఎఫెక్ట్ తో సగం ప్రపంచం లాక్ డౌన్ అయ్యింది. దీని ప్రభావంతో మనుషుల కన్నా కూడా జంతువులపై ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వీధి కుక్కలు, పిల్లులు ఇతర జంతువులకు తిండి కరవైంది. రెస్టారెంట్లు, హోటల్స్, ఫంక్షన్స్ బంద్ అవటంతో తిందామంటే వాటికి ఏమీ దొరుకతలేదు. రోజు ఫుడ్ దొరికే స్పాట్ లకు వెళ్లి అక్కడ ఏమీ లేకపోవటంతో ఆగమాగం అవుతున్నాయి. జంతు ప్రేమికులు ఈ పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కోట్లాది జంతువులకు డెత్ సెంటన్స్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీస్, యూరోప్, టర్కీ లాంటి దేశాల్లో జంతువులకు ఆహారం అందించేందుకు అక్కడి అధికారులు దృష్టి పెట్టారు. ” మేము ఫీడ్ వేస్తున్న చోటికి వందలాది పిల్లలు వస్తున్నాయి. కొన్ని రోజు ఫుడ్ దొరికే ప్లేస్ కు వెళ్లి దీనంగా చూస్తున్నాయి” అని గ్రీస్ లోని నైన్ లైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కార్డెలియో మాడెన్ తెలిపారు. ఆకలితో వీధి కుక్కలు క్రూరంగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రీక్ అధికారులు జంతువులకు ఫుడ్, ట్రీట్ మెంట్ అందిచేందుకు ఆన్ లైన్ ద్వారా జనాన్ని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పెద్దగా స్పందన రావటం లేదు. దీంతో యానిమల్ వెల్పేర్ సోసైటీలే వాటికి ఫుడ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. “లాక్ డౌన్ సమయంలో అథెన్స్ లో ఉన్న అన్ని కుక్కలు, పిల్లుల కోసం ఫుడ్ సిద్ధం చేస్తున్నాం. నగరంలోని పలు ప్రాంతాల్లో వాటి కోసం ఆహారాన్ని ఉంచుతాం ” అని అథెన్స్ యానిమల్ వెల్ఫ్ ఫేర్ కౌన్సిలర్ సెరఫినా తెలిపారు. 350 మంది వాలంటీర్లు నగరంలో జంతువులకు ఫుడ్ ను అందించేందుకు పనిచేస్తున్నారని చెప్పారు. టర్కీలోని ఇస్తాంబుల్ రోజు వెయ్యి కిలోల ఆహారాన్ని పిల్లలకు, కుక్కలకు అక్కడి అధికారులు అందిస్తున్నారు. యూరోప్ లోనూ స్ట్రీట్ డాగ్స్, క్యాట్స్ కు ఫుడ్ అందించేందుకు ఇప్పుడిప్పుడే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అన్ని దేశాల్లో జంతువులకు లాక్ డౌన్ సమయంలో ఫుడ్ అందించేందుకు ఏర్పా్ట్లు చేయాలని యానిమల్స్ లవర్స్ కోరుతున్నారు.