ఏం టార్చర్ రా : మెట్రో రైలులో లేడీస్ హోలీ రొమాన్స్..

ఏం టార్చర్ రా : మెట్రో రైలులో లేడీస్ హోలీ రొమాన్స్..

ఢిల్లీ మెట్రో.. అది రైలు కాదు డాన్స్ షోలకు వేదిక.. రొమాన్స్ కు అడ్డా.. రీల్స్ కు ఐకాన్ అయిపోయింది.. ఎవరు పడితే వాళ్లు.. ఏది పడితే అది.. ఎలా పడితే అలా.. ఇష్టం వచ్చినట్లు తమ టాలెంట్ చూపించేసుకుంటున్నారు.. ఎన్ని సార్లు.. ఎన్ని రకాలుగా వార్నింగ్స్ ఇచ్చినా.. రీల్స్ పిచ్చి మాత్రం తగ్గటం లేదు. తమ టాలెంట్ చూపించుకోవటానికి ఢిల్లీ మెట్రోను అడ్డాగా చూసుకుంటున్నారు యూత్.. నిన్నటికి నిన్న హోలీ ఆడుతూ.. ఇద్దరు లేడీస్ చేసిన వీడియో ఇంటర్నరెట్ ట్రెండ్ అయ్యింది.. ఆ మజా విశేషాలు ఏంటో చూద్దామా...

 ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ఇద్దరు అమ్మాయిలు చీరలు కట్టుకుని కదులుతున్న మెట్రోలో నేలపై కూర్చొని రొమాంటిక్ సాంగ్ కు రొమాన్స్ చేస్తూ ఒళ్లంతా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇది ఇక్కడితో ఆపకుండా ఒకరికొకరు తమ ముఖాలను రుద్దుకుంటూ రంగులు అంటించుకోవడం చేస్తూ వీడియో తీయించుకున్నారు. 

తీసిన వీడియోను దాచిపెట్టకుండా సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అమ్మాయిలు "ఇది మెట్రో స్టేషన్ లేదా సెడ్యూస్డ్ స్టేషన్" అని ఒకరు ఫైర్ అయితే.. మరొకరు.. ఢిల్లీ మెట్రోలో జరిగే అరాచకాలకు కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని కామెంట్స్ చేశారు.