Ladyfinger : తాజా బెండకాయలను ఎలా గుర్తించాలంటే..

Ladyfinger : తాజా బెండకాయలను ఎలా గుర్తించాలంటే..

తాజా బెండకాయలను ఎలా గుర్తించాలో వంట గురించి తెల్సిన ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ చూసినా అంతా రసాయనాలమయమే. కల్తీ పండ్లు, కూరగాయలు మార్కెట్లో ప్రత్యక్షమవుతూ ఆందోళనకు గురి చేస్తోంది. బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. విటమిన్ సి, ఫైబర్లు పుష్కలంగా లభించే ఈ బెండకాయలు ఏవి తాజావో, ఏవి నకిలీవో గుర్తించడమెలానో ఇప్పుడు చూద్దాం.

లేత వాటినే కొనండి

కొన్ని బెండకాయలు అవి లేతగా ఉన్నాయా, ముదురుగా ఉన్నాయా అన్నది చూడగానే తెల్సిపోతాయి. నీటితో పాటు విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉండే వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది.

బెండకాయలు ఆరోగ్యకరమైన జీవితానికి చాలా మేలు చేస్తుంది. దీని వల్ల శరీరానికి పోషకాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల కడుపు శుభ్రం కావడం, పేగుల పని తీరును మెరువడం జరుగుతుంది.