
ఫుణె : ఇండియా కూటమికి చెందిన నేత వద్ద రూ.200 కోట్ల నల్ల ధనం లభిస్తే, బీజేపీ నేతల ఇండ్లల్లో సోదాలు చేస్తే లక్ష కోట్ల నల్ల ధనం దొరుకుతుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుపై ఐటీ రైడ్స్ లో లెక్కల్లో చూపని ధనం రూ.353 కోట్లు పట్టుబడటంతో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ధీరజ్ ప్రసాద్ సాహు కేసు గురించి బీజేపీ అరిచి గోల చేస్తుందని తెలిపారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అగ్ర నేత ప్రఫుల్ పటేల్ వద్ద పట్టుబడిన రూ.400 కోట్ల గురించి ఆ పార్టీ మాట్లాడటం లేదని చెప్పారు. ఈ విషయం గురించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాస్తానని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.