మస్కట్​లో వైభవంగా ..లక్ష్మీనారసింహుడి కల్యాణం

 మస్కట్​లో వైభవంగా ..లక్ష్మీనారసింహుడి కల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు : ‘ఒమన్ తెలంగాణ సమితి’ ఆధ్వర్యంలో ఆ దేశ రాజధాని అయిన మస్కట్ లో శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. గుట్ట ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల నేతృత్వంలో అర్చక బృందం నారసింహుడి కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించింది.

శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన కల్యాణం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అక్కడ సెటిలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఉప ప్రధానార్చకులు నరసింహమూర్తి, అర్చకులు నల్లంథీగల్ సిద్దు ఉన్నారు.