లాంఛనంగా ‘లాల్ సింగ్ చద్దా ‘మెగా’ ప్రివ్యూ

లాంఛనంగా ‘లాల్ సింగ్ చద్దా ‘మెగా’ ప్రివ్యూ

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా. ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, తన ప్రియమిత్రుడైన చిరంజీవితో పాటు, తెలుగు సినీ పరిశ్రమలోని మరికొందరు అతిథుల కోసం లాల్ సింగ్ చ‌ద్దా ప్రత్యేక ప్రివ్యూను నిర్వహించారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన ఈ ప్రివ్యూకి కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్  డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారు. లాల్ సింగ్ చ‌ద్దా ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.