ప్లాన్ ‘ఏ’ అమలు కాకపోతే.. ప్లాన్ ‘బీ’.. పోలీసుల విచారణలో లలిత్ ఝా

ప్లాన్ ‘ఏ’ అమలు కాకపోతే.. ప్లాన్ ‘బీ’.. పోలీసుల విచారణలో లలిత్ ఝా
  • పోలీసులకు వెల్లడించిన మాస్టర్ మైండ్ లలిత్ ఝా

న్యూఢిల్లీ: పార్లమెంట్ స్మోక్ అటాక్ ఘటనలో ప్లాన్ ‘బీ’ కూడా సిద్ధం చేసుకున్నట్లు మాస్టర్ మైండ్​గా భావిస్తున్న లలిత్‌‌ ఝా పోలీసులకు తెలిపాడు. గురువారం రాత్రి కర్తవ్యపథ్​ స్టేషన్ లో లలిత్, మహేశ్ పోలీసులకు లొంగిపోయారు. స్మోక్ అటాక్ గురించి వివరిస్తూ.. ‘‘ప్లాన్ ‘ఏ’ ప్రకారం.. నీలం దేవి, అమోల్ షిండే పార్లమెంట్​కు చేరుకోవాలి. ఒకవేళ వీళ్లని ఎవరైనా అడ్డుకుంటే.. వెంటనే ప్లాన్ ‘బీ’ అమలు చేయాలని భావించాం. ప్లాన్ ‘బీ’ ప్రకారం.. మహేశ్, కైలాశ్​లు వేరే మార్గం గుండా పార్లమెంట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. క్యానిస్టర్లను నుంచి ఎల్లో గ్యాస్ ఓపెన్ చేసి.. మీడియా కెమెరాల ముందు స్లోగన్స్ చేయాలి. ఇది ముందుగా అనుకున్న ప్లాన్. అయితే.. లాస్ట్ మినిట్​లో నీలం దేవి, అమోల్ షిండేలను ప్లాన్ ‘ఏ’ అమలు చేయాలన్నాను” అని లలిత్ చెప్పాడు.

నలుగురి సెల్​ఫోన్స్ తగులబెట్టిన లలిత్

ప్రూఫ్స్ దొరక్కుండా నలుగురి సెల్​ఫోన్లను రాజస్థాన్​లో తానే తగులబెట్టినట్లు లలిత్ వివరించాడు. కాగా, నిందితులు బూట్ల కింద ఉండే సోల్‌‌ను కట్‌‌ చేసి అందులో గ్యాస్‌‌ క్యానిస్టర్లను అమర్చి పార్లమెంట్ లోపలకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురిపై టెర్రరిజం చార్జెస్​తో పాటు ‘ఉపా’ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లలిత్ ఝాను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వారం రోజులు పోలీసు కస్టడీ ఇచ్చింది.