
రాంచీ: పశువుల దాణా కుంభకోణం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయినా లాలూ జైలులోనే ఉండనున్నారు. పశువుల దాణాకు సంబంధించిన చైబసా ట్రెజరీ కేసులో లాలూకు బెయిల్ లభించినప్పటికీ.. దుమ్కా ట్రెజరీ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున ఆయన జైలులోనే ఉండనున్నారు.
బిహార్ సీఎంగా ఉన్న సమయంలో రూ.33.67 కోట్లను చైబసా ట్రెజరీ నుంచి మోసపూరితంగా విత్‌డ్రా చేశారని లాలూపై అభియోగాలు ఉన్నాయి. 50 వేల పూచీకత్తుపై లాలూకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా కేసులో రూ.3.13 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేశారని లాలూపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనపై రెండు వేర్వేరు సెక్షన్‌లకు గాను ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇందులో దాదాపు సగం సమయం (30 నెలల) లాలూ జైలు జీవితం గడిపారు.