లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కూతురు

లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కూతురు

పాట్నా: అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కురువృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్‌‌‌‌కు ఆయన కూతురు రోహిణీ ఆచార్య తన కిడ్నీ ఇవ్వనున్నారు. కిడ్నీ సమస్యలతో ఇటీవల సింగపూర్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందిన లాలూ.. గత నెలలో తిరిగి ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉందని డాక్టర్లు సూచించారు. 

దీంతో సింగపూర్‌‌‌‌‌‌‌‌లో ఉండే రోహిణీ ఆచార్య.. తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు లాలూ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. అయితే ఈ ఆపరేసన్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. దాణా కుంభకోణానికి సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. ప్రస్తుతం బెయిల్‌‌‌‌పై బయట ఉన్నారు.