లాలూ ప్రసాద్ కు వైద్య పరీక్షలు

లాలూ ప్రసాద్ కు వైద్య పరీక్షలు

దాణా స్కాంలో శిక్షపడ్డ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)లో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు లాలూకు ఎకో కార్డియోగ్రఫీతో పాటు ఈసీజీ, డెంటల్ చెకప్ నిర్వహించారు. ఎకో, ఈసీజీ రిపోర్టులు నార్మల్గానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దంత సమస్యలకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని రిమ్స్ డాక్టర్ వైద్యపతి తెలిపారు.

దాణా కుంభకోణం ఐదో కేసులో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు సోమవారం రాంచీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు, రూ.60లక్షల జరిమానా విధించింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం లాలూ మరోసారి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను రాంచీలోని రిమ్స్‌ కు తరలించారు. లాలూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. కాగా.. ఆయన బ్లడ్‌ షుగర్‌, బీపీలలో హెచ్చుతగ్గులున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఏడుగురు డాక్టర్లతో కూడిన ప్రత్యేక బృందం లాలూ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.