నాన్నకు ప్రేమతో : లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె రోహిణి

నాన్నకు ప్రేమతో : లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె రోహిణి

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కిడ్నీ దానం చేసేందుకు రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు. లాలూకు తప్పనిసరిగా కిడ్నీల మార్పిడి చేయాలని.. రెండు కిడ్నీలు దాదాపు 75 శాతం దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో సింగపూర్ లో నివసించే ఆయన కుమార్తె రోహిణి కిడ్నీని దానం చేస్తానని వెల్లడించారు.

పశువుల దాణా కుంభకోణం కేసులో  బెయిల్ పై ఉన్న లాలూ.. ప్రస్తుతం  ఢిల్లీలోని తన పెద్ద కుమార్తె మీసా భారతి ఇంట్లో ఉంటున్నారు. నవంబరు 20 నుంచి 24 తేదీల మధ్య ఏదో ఒకరోజు సింగపూర్ లో లాలూకు కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది.  అంతకుముందు ఈ ఏడాది జులైలో లాలూ ప్రసాద్ యాదవ్ ఐసీయూలో ఉన్న సమయంలో భావోద్వేగానికి లోనైన కుమార్తె రోహిణి ఆచార్య ‘నాన్నే నా హీరో’ అంటూ ట్వీట్ చేశారు.