డెవలప్మెంట్ పేరిట భూ కబ్జాలు

డెవలప్మెంట్ పేరిట భూ కబ్జాలు

సిద్ధిపేట, వెలుగు: పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములు డెవలప్మెంట్ పేరిట కబ్జాకు గురవుతున్నాయని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  మిట్టపల్లి గ్రామంలోని పలు సర్వేనెంబర్లలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని వెనుకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. 

ఈ విషయంలో అర్బన్ తహసీల్దార్​పై కూడా విచారణ చేపట్టాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారులు, పాలకులు దోచుకో  దాచుకో అన్నట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. భూ కబ్జాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వీటిని  ప్రభుత్వానికి అప్పగిస్తామని వెల్లడించారు. సమావేశంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మజార్ మాలిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మధు, గయాజుద్దీన్, నజ్జూ,  నవాజ్, యాదగిరి, ప్రశాంత్ పాల్గొన్నారు.