సిరిసిల్లలో భూ తగాదాలో ముగ్గురికి కత్తిపోట్లు..

సిరిసిల్లలో భూ తగాదాలో ముగ్గురికి కత్తిపోట్లు..
  • మూడేండ్ల బాలుడితో పాటు గర్భవతికి గాయాలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మూడు ఫీట్ల తొవ్వ కోసం జరిగిన గొడవలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో మూడేండ్ల బాలుడు, గర్భవతి కత్తిపోట్లకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కలికోట వెంకటేశ్​కు, అతడి అన్న కొడుకు పృథ్వీకి తొవ్వ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వెంకటేశ్​ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు.

దీంతో ఆగ్రహించిన పృథ్వీ మంగళవారం సాయంత్రం ముగ్గురు స్నేహితులతో కలిసి వెంకటేశ్​ ఇంటికి వచ్చి అతడితో పాటు కొడుకు త్రినేత్ర(3), భార్య ఏంజెల్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన త్రినేత్రను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్  సీఐ కృష్ణ తెలిపారు. దాడి చేసిన పృథ్వీ పరారీలో ఉన్నట్లు చెప్పారు.