టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్కు నిరసన సెగ తగిలింది. ల్యాండ్ పూలింగ్ జీఓ 80Aను రద్దు చేయాలంటూ పున్నెలు క్రాస్ రోడ్డ దగ్గర ఎమ్మెల్యే వాహనాన్ని బాధిత రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీఓను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలు పోయినా గుంట భూమిని కూడా వదులుకోమని రైతులు తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్  కారు దిగి వచ్చి..బాధితులతో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఆందోళన

వామ్మో వెయ్యి సిక్సర్లే..!