భూములు భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి: భూనిర్వాసితులు

భూములు భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి: భూనిర్వాసితులు

కాజీపేట, వెలుగు : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని భూనిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. కాజీపేటలోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోతున్న బాధితులు ఆదివారం హనుమకొండలోని ఎంపీ కడియం కావ్యను ఆమె నివాసంలో కలిశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న భూనిర్వాసితుల కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎంపీ స్పందిస్తూ కలెక్టర్ తో మాట్లాడి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలని రైల్వే మంత్రిని కూడా కలిసి కోరుతానని చెప్పారు. ఎంపీని కలిసిన వారిలో రైల్వే జేఏసీ నాయకులు దేవులపల్లి రాఘవేందర్ రావు, భూనిర్వాసితులు యాదగిరి, రాజయ్య, భిక్షపతి, అనిల్, కుమార్ ఉన్నారు.