బల్లకట్టుతో ఏపీకి భారీగా మద్యం అక్రమ రవాణా

బల్లకట్టుతో ఏపీకి భారీగా మద్యం అక్రమ రవాణా

ఏపీకి పెద్దఎత్తున మద్యం, గుట్కా, పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం అక్రమ రవాణా
అక్రమ రవాణాకు అడ్డాగా మారిన చింతలపాలెం మండలం
 లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైంలో నిషేధం ఉన్నా నడుస్తున్న బల్లకట్టు
 రవాణా వెనుక ముఖ్యనేత బంధువు..పట్టించుకోని ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు : అక్రమ దందాను అడ్డుకునేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – విజయవాడ హైవేపైనే పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు తమ దందాకు కృష్ణా నదిలో నడిచే బల్లకట్టును వాడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో ఇక్కడి నుంచి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లు నిఘా కూడా పెట్టకపోవడంతో అక్రమార్కుల బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సిమెంట్, గ్రానైట్, పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం, గుట్కా, మద్యం యథేచ్ఛగా సరిహద్దు దాటిస్తున్నారు. అయితే ఈ దందా విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
రవాణా మొత్తం బల్లకట్టు మీదే.. 
ఇటు తెలంగాణ, అటు ఏపీ గట్ల మధ్య కృష్ణా నదిలో తిరిగే బల్లకట్టునే అక్రమమార్కులు తమ రవాణా సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని చింతిర్యాల, బుగ్గమాదారం, మట్టపల్లి వద్ద జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో బల్లకట్టు నడుపుతున్నారు. ఇక్కడ నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు కలిసి వస్తోంది. రాత్రి పూట బల్లకట్టు నడపడం నిషేధించినప్పటికీ ఎవరూ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించడం లేదు. రాత్రిపూట యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు.
పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే...
తెలంగాణ, ఏపీలో లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ అమల్లో ఉన్నందున బల్లకట్టు నడుపొద్దని ఆఫీసర్లు ఆదేశించారు. అలాగే పర్మిషన్ లేకుండా బల్లకట్టు ద్వారా ఎలాంటి సరుకును రవాణా చేయొద్దు. కానీ బల్లకట్టు నిర్వాహకులు ఆఫీసర్ల ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా సరుకు తరలించేస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక అధికార పార్టీ ముఖ్య నేత బంధువు ఉండడంతోనే ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 
పెద్దమొత్తంలో మద్యం తరలింపు
ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో కొందరు వ్యక్తులు తెలంగాణ నుంచి మద్యాన్ని తరలించి అక్కడ అమ్ముకుంటున్నారు. రోడ్డు మార్గం గుండా తరలిస్తే పోలీసులు పట్టుకునే అవకాశం ఉన్నందున బల్లకట్టు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు.
నిఘా పెడుతాం 
లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైంలో బల్లకట్టు నడపడం నిషేధం. బల్లకట్టు నడిపే వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే అక్రమ రవాణాపై నిఘా పెడుతాం.
                                                                                                                                 -  ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీసీఈవో, సూర్యాపేట