హైదరాబాద్, వెలుగు : ఆభరణాల బ్రాండ్ శ్రీ కృష్ణ జ్యూయెలర్స్ ధన్‌తేరస్, దీపావళి పండుగలను పురస్కరించుకుని వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం నగరంలో అతిపెద్ద ఆభరణాల ప్రదర్శనను నిర్వహిస్తోంది. నవంబర్ 1వ తేదీ వరకు తమ బంజారాహిల్స్ స్టోర్‌లో ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపింది. వజ్రాలు, బంగారు నగలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు.
ధన్‌తేరస్ ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ఆఫర్‌లో నగలపై వేస్టేజీ 10శాతం వరకు మాత్రమే ఉంటుందని, వీవీఎస్ఈఎఫ్సర్టిఫైడ్ డైమండ్ నగలు ప్రతి క్యారెట్‌కు రూ.49,999తో ప్రారంభమవుతాయని పేర్కొంది. సాధారణ బంగారు ఆభరణాలపై తయారీ చార్జీలను తీసుకోవడం లేదని శ్రీకృష్ణ జ్యూయెలర్స్ తెలిపింది.