- అధికారులకు పైలట్ ఫిర్యాదు
గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్రాంక్‌ఫర్ట్(జర్మనీ) నుంచి వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం కాక్‌పిట్‌పై లేజర్ లైట్లు పడటం కలకలం రేపింది. సోమవారం సరిగ్గా ల్యాండింగ్కోసం దిగుతుండగా.. లేజర్ లైట్నేరుగా కాక్‌పిట్‌పై పడటంతో పైలట్ కొద్దిసేపు ఇబ్బందికి గురయ్యాడు. అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, ఘటనపై విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అధికారులు విచారణ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్చుట్టుపక్కల ఫాంహౌస్లు ఉన్నాయని, బహుశా అక్కడ ఏదైనా ఫంక్షన్లు జరుపుకునేటప్పుడు వేసుకునే లేజర్లైట్లు పడి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఫాంహౌస్లలో, ఇండ్లలో ఉండే ఆకతాయిలు కావాలనే ఇలా చేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.
