
- ఈ ఏడాది కూడాడీజేలకు నో పర్మిషన్
- సంప్రదిస్తే ఫలహరం బండ్లు ఊరేగింపులకూ బందోబస్తు
- నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ఉత్సవాల్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జులై 13న బోనాల సమర్పణ, 14న రంగం (భవిష్యవాణి), అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు.
ఈ రెండు రోజుల్లో భక్తులు లక్షల్లో తరలివస్తారని, ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బోనాలతో తరలివచ్చే మహిళల కోసం మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
లష్కర్ బోనాలు ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తుల కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, ఫలహరం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.