చివరి కెప్టెన్సీ కూడా దక్కలేదు?.. బోరున ఏడ్చేసిన అమర్

చివరి కెప్టెన్సీ కూడా దక్కలేదు?.. బోరున ఏడ్చేసిన అమర్

బిగ్‌బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. అందుకే.. ఈవారం కెప్టెన్సీ టాస్క్ అండ్ ఎలిమినేషన్ పై ఉత్కంఠ నెలకొంది. దాదాపు పది వారాల నుండి కెప్టెన్సీ కోసం కష్టపడుతున్న అమర్ ఈవారం అయినా కెప్టెన్ అవుతాడా? అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఈ వరం కూడా అమర్ కు కెప్టెన్సీ అనేది అందని ద్రాక్ష పండులాగే మిగిలిపోయిందని తెలుస్తోంది.

నిజానికి ఈవారం బిగ్ బాస్ సీజన్ 7లో ఆఖరి కెప్టెన్సీ కాబట్టి.. ఎలా అయినా కెప్టెన్ అవ్వాలని చాలా ఆశ పడ్డాడు అమర్. అందుకోసం ఈవారం తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు కూడా. అంతేకాదు.. హౌస్ లో ప్రతి ఒక్కరిని సపోర్ట్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నాడు. తన ముందు అందరూ ఒకే అన్నారు. అందులో కొంతమంది ఇచ్చన మాటను నిలబెట్టుకున్నారు. 

ఇక ఈవారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పెట్టిన చివరి టాస్క్ ఏంటంటే.. రెండు ఫోటోలు చూపించి.. ముందుగా వచ్చిన ఇద్దరు హౌస్‌మేట్స్ ఒక నిర్ణయానికొచ్చి.. ఒకర్ని సేవ్ చేయాలి, ఒకర్ని షూట్ చేయాలిని చెప్పారు. అలా ఒక్కొక్కరు తమ నిర్ణయాన్ని చెప్పగా.. చివరి రౌండ్ లో శోభా, శివాజీ.. అమర్ అండ్ అర్జున్ లో ఒకరిని సేవ్ చేయాల్సి వచ్చింది. అందులో శోభా అమర్ పేరు చెప్పగా.. శివాజీ అర్జున్ పేరు చెప్పారు. ఈ ఇద్దరి మధ్య చాలాసేపు చర్చ జరిగింది. ఇదంతా చూసిన అమర్ తనని కెప్టెన్ చేయమని బోరున ఏడ్చేశాడు. అయినా కూడా శోభా, శివాజీ ఒక మాటమీదకి రాలేదు. దాంతో నిర్ణయం చెప్పకపోతే కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించాడు బిగ్‌బాస్. దీంతో శివాజీ, శోభా ఒక మాట మీదకి వచ్చి అర్జున్ పేరుని చెప్పారు.

కానీ అప్పటికే టాస్క్ సమయం ముగియడంతో ఎపిసోడ్ అయ్యిపోయింది. దీంతో చివరి కెప్టెన్ ఎవరన్నదానిపై క్లారిటీ రాలేదు. అంతేకాదు అసలు కెప్టెన్ టాస్క్ ఉందా? క్యాన్సిల్ అయ్యిందా? అనేది కూడా సస్పెన్స్ గా మారింది. మరి అమర్ చివరి వారం కెప్టెన్ అయ్యాడా? లేదా? అనేది తెలియాలంటే ఈవాట్లి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.