
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నంబర్ 12 సమీపంలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బెంజ్ కారు.. రెండు బైకులను ఢీకొట్టింది.హైస్పీడ్ లో ఉండటంతో అంతటితో ఆగకుండా ఆడి కారును ఢీకొట్టింది. గమనించిన స్థానికులు కారును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవర్ ను చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం గాయపడ్డ వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.