‘ఇండియన్‌‌ 2’ నుంచి క్రేజీ అప్డేట్

‘ఇండియన్‌‌ 2’ నుంచి క్రేజీ అప్డేట్

విశ్వ నటుడు కమల్ హాసన్ ఛాలెంజింగ్‌‌ క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఎంత రిస్క్‌‌కు అయినా కమల్ రెడీ. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం ‘ఇండియన్‌‌ 2’లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సీక్వెల్‌‌లో తొంభై ఏళ్ల ‘సేనాపతి’ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకోసం ప్రోస్తెటిక్ మేకప్ వేసుకోడానికి ఐదు గంటలు, తీయడానికి రెండు గంటల టైమ్ పడుతుంది. కేవలం మేకప్‌‌కు ఏడు గంటలు కేటాయిస్తున్న ఆయన.. క్యారెక్టర్ కోసం స్ట్రిక్ట్‌‌ డైట్‌‌ మెయింటైన్ చేస్తున్నారట. ఫుడ్ నమిలితే మేకప్‌‌పై ఎఫెక్ట్ పడుతుందని జ్యూస్‌‌ డైట్‌‌లో ఉంటున్నారట కమల్.

ఈ మూవీ రైటర్ బి.జయమోహన్ ఆ విషయాలను ఇటీవల రివీల్ చేశారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో క్యారెక్టర్ కోసం ఇంతలా డెడికేషన్‌‌ చూపించడం కమల్‌‌కు మాత్రమే సాధ్యం అన్నారు మోహన్. గత కొద్దిరోజులుగా చెన్నై ఐటీ పార్క్‌‌లో షూటింగ్‌‌ జరుగుతోంది. కమల్ హాసన్, బాబీ సింహా కాంబినేషన్‌‌ సీన్స్ తీస్తున్నారు. 1920 బ్యాక్‌‌డ్రాప్‌‌లో సేనాపతి తండ్రి పాత్రను చూపించబోతున్నారని, ఆ క్యారెక్టర్‌‌‌‌కు పవర్‌‌‌‌ఫుల్ ప్లాష్‌‌బ్యాక్ ఉంటుందని టాక్. దీంతో మరోసారి రెండు క్యారెక్టర్స్‌‌లో కమల్ కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌ సింగ్, సిద్దార్థ్, స‌‌ముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌‌విచంద‌‌ర్ సంగీతం అందిస్తున్నాడు.