టెక్నాలజీ .. గూగుల్ వ్యాలెట్

టెక్నాలజీ .. గూగుల్ వ్యాలెట్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం గూగుల్ వ్యాలెట్ యాప్ తెచ్చింది. వ్యాలెట్ అంటేనే పేమెంట్​కి పనికొచ్చేది. కానీ, ఇది అలాంటి వ్యాలెట్​ కాదు. బ్యాంక్ కార్డ్స్​ను స్టోర్ చేయదు. దానివల్ల డిజిటల్ పేమెంట్స్ చేయలేరు. ఈ యాప్​లో రివార్డ్స్​,  టికెట్స్, కారు కీస్ స్టోర్ చేసుకునేలా పనిచేస్తుంది. ఇండియాలో రిలీజ్ అయిన ఈ వ్యాలెట్​ ఇంటర్నేషనల్ వెర్షన్​కు భిన్నంగా ఉంటుంది. ఇది గూగుల్ ప్లేస్టోర్​లో అందుబాటులో ఉంది. 

ఎలా వాడాలి?

గూగుల్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ వ్యాలెట్​ యాప్​ని డౌన్​లోడ్ చేయాలి. డౌన్​లోడ్​ చేశాక గూగుల్ వ్యాలెట్ యాప్ స్క్రీన్​పై చూపించే సూచనలను ఫాలో కావాలి. కొత్తవాళ్లయితే పేమెంట్ కార్డ్​ని యాడ్ చేయమనే ప్రాంప్ట్ వస్తుంది. దీన్ని కెమెరాతో స్కాన్ చేయొచ్చు లేదా వివరాలను మాన్యువల్​గా ఎంటర్ చేయొచ్చు. ఇప్పటికే గూగుల్ పే వాడుతుంటే.. కార్డ్స్​, టికెట్స్, పాస్​లను గూగుల్ వ్యాలెట్​లోని మీ డాక్యుమెంట్స్​లో చూడొచ్చు. 

ఆండ్రాయిడ్​ ఫోన్​లో సేఫ్టీ కోసం స్క్రీన్​ లాక్​ కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్​తో కాంటాక్ట్​లెస్ పేమెంట్ల కోసం డివైజ్ సాఫ్ట్​వేర్ అవసరాలకు అనుగుణంగా ఉందనేది ముందు నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్​ఎఫ్​సి) ఆన్​ చేసి ఉండాలి. గూగుల్ వ్యాలెట్​తో కాంటాక్ట్​లెస్ పేమెంట్లు చేయొచ్చు. కొన్ని వెర్షన్​లకు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. పాత ఆండ్రాయిడ్​ ఫోన్లలో పనిచేయదు. జూన్ 10 నుంచి గూగుల్ వ్యాలెట్ పై(pie) 9 కన్నా తక్కువ ఆండ్రాయిడ్​ వెర్షన్లు లేదా 2.x కంటే తక్కువ ఉన్న wear OS వెర్షన్​లను వాడే ఫోన్స్​లో పనిచేయదు.