టెక్నాలజీ ..సిమ్​ కార్డ్ బ్లాక్

టెక్నాలజీ ..సిమ్​ కార్డ్ బ్లాక్

గవర్నమెంట్ వెబ్​సైట్ ‘సంచార్​సాథీ’ ద్వారా గతంలో తీసుకున్న నెంబర్లు,  ప్రస్తుతం వాడుతున్న సిమ్​కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు గతంలో తీసుకుని వాడని సిమ్​కార్డ్స్​ను ఆన్​లైన్​లోనే బ్లాక్ చేసేయొచ్చు కూడా. https://sancharsaathi.gov.in/ వెబ్​సైట్​లోకి వెళ్లాలి.  సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్​ కేటగిరీలో ‘నో యువర్ మొబైల్ కనెక్షన్స్(know your mobile connections)’ క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్​మెంట్ అండ్ కన్జ్యూమర్​ ప్రొటెక్షన్ (టీఎఎఫ్​సీఓపీ) అందిస్తోంది.

‘నో యువర్ మొబైల్ కనెక్షన్స్’​పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్​ను ఎంటర్ చేయాలి. తరువాత కింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, వ్యాలిడేట్ క్యాప్చా మీద నొక్కాలి. పైన ఇచ్చిన మొబైల్ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దాని కింద ఉన్న బ్లాక్​లో ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అప్పుడు మన పేరుతో ఏ నెంబర్లు రిజిస్టర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది. వాటిలో ఏదైనా నెంబర్​ బ్లాక్ చేయాలనుకుంటే పక్కనే ఆప్షన్స్​ కనిపిస్తుంటాయి. వాటిని ఫాలో అయ్యి, క్లిక్ చేసి సబ్మిట్​ చేయాలి. ప్రాసెస్ అయిపోయాక చివరిగా లాగవుట్ చేయాలి.