అమ్మాయిలు వీడియో గేమ్స్‌లో ఏం ఆడుతున్నారంటే

అమ్మాయిలు వీడియో గేమ్స్‌లో ఏం ఆడుతున్నారంటే
  • ఫ్యాషన్ గేమ్స్ తెగ ఆడేస్తున్నారు.. 
  • నెయిల్ పాలిష్, హెయిర్ స్టైల్.. మ్యాచింగ్ గేమ్‌లు లక్షల్లో డౌన్లోడ్
  • ఫ్యాషన్‌‌ గేమ్స్‌‌లో అమ్మాయిలే టాప్‌‌

ట్రెండ్‌‌కు తగ్గట్లుగా ఉండుడంటే ఆడోళ్లకు మస్తు ఇష్టం. మార్కెట్‌‌లోకి వచ్చిన కొత్తరకం ఫ్యాషన్‌‌ను కచ్చితంగ ట్రై చేస్తరు. అందుకే అన్ని రంగాల్లో కల్లా ఫ్యాషన్‌‌ రంగమే ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో ఉంటది. అయితే, ఒక్క ఫ్యాషన్‌‌ రంగమే కాదు.. ఫ్యాషన్‌‌ గేమ్స్‌‌ కూడా టాప్‌‌లోనే ఉన్నయట. హెయిర్‌‌‌‌స్టయిల్‌‌, నెయిల్‌‌ పాలిష్‌‌ వేసుకోవడం లాంటి ఫ్యాషన్‌‌ ఆటలను ఫోన్‌‌లో మస్తు ఆడుతున్నరట లేడీస్‌‌. ఇగ మన దేశంల ఈ గేమ్‌‌లను లక్షలమంది డౌన్‌‌లోడ్‌‌ చేసుకుని ఆడుతున్నరని సర్వేలు చెప్తున్నయ్‌‌! అందుకే గేమ్‌‌ డెవలపర్స్‌‌ కూడా అలాంటి వాటిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నరట. 
స్మార్ట్‌‌ఫోన్‌‌ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో కచ్చితంగా ఫోన్‌‌ కనపడుతుంది. ఆ ఫోన్‌‌లో కచ్చితంగా కనీసం ఒక్క గేమైనా ఉంటది. అలా పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికీ గేమ్స్‌‌ ఆడటం అలవాటుగా మారింది. అయితే, ఆడవాళ్లు ఆడే గేమ్స్‌‌ మాత్రం కాస్త వెరైటీగా ఉన్నాయని యాప్‌‌ సర్వేలు చెప్తున్నాయి. మన దేశంలోని చాలామంది ఆడవాళ్లు ఫ్యాషన్‌‌ గేమ్స్‌‌నే ఎక్కువగా ఆడుతున్నరట. ఒకప్పుడు ఈ గేమ్స్‌‌ ఆడటంలో యూఎస్‌‌, బ్రెజిల్‌‌ టాప్‌‌లో ఉంటే ఇప్పుడు మన దేశం కూడా వాటితో జత కట్టింది. 2020లో మన దగ్గర ఫ్యాషన్‌‌ గేమ్స్‌‌ డౌన్‌‌లోడ్‌‌లు 100 శాతం పెరిగాయని ‘సెన్సర్‌‌‌‌ టవర్‌‌‌‌ షో’ అనే యాప్‌‌ ఎనలటిక్స్‌‌ సంస్థ చెప్పింది. మహిళలు ఫోన్‌‌లో వాడే ఇంటర్నెట్‌‌ దాదాపు ఇలాంటి గేమ్స్‌‌కే వాడుతున్నారని ఆ సంస్థ చెప్తోంది. మనదేశంలో 43 శాతం గేమర్స్‌‌ మహిళలే ఉంటే.. వారిలో 77శాతం మంది రోజులో ఒక్కసారైనా ఫోన్‌‌లో గేమ్‌‌ ఆడుతున్నారట. 32 శాతం మంది మహిళలు అతి తక్కువ టైం ఆడే గేమ్స్‌‌పై ఆసక్తి చూపుతున్నారు.  
లక్షల్లో ఇన్‌‌స్టాల్‌‌ చేసుకున్నరు
మన దేశంలో ఫ్యాషన్‌‌, ఈస్తటిక్‌‌, హెయిర్‌‌‌‌ స్టైల్‌‌ గేమ్స్‌‌ బాగా ట్రెండింగ్‌‌లో ఉన్నాయి. వాటినే లక్షల్లో ఇన్‌‌స్టాల్‌‌ చేసుకుంటున్నారు. 2020లో జింగాస్‌‌కు చెందిన ‘హై హీల్స్‌‌!’(High Heels!) యాప్‌‌ను అరవై లక్షల మంది ఇన్‌‌స్టాల్‌‌ చేసుకున్నారు. లైన్‌‌ స్టూడియోస్‌‌ రూపొందించిన ‘ఐసింగ్‌‌ ఆన్‌‌ ద డ్రెస్‌‌’ (Icing On The Dress) గేమ్‌‌ను నలభై లక్షల మంది ఇన్‌‌స్టాల్‌‌ చేసుకున్నారు. ఈ యాప్స్‌‌ వాడకంలో బ్రెజిల్‌‌, ఇండియా టాప్‌‌లో ఉన్నాయి. హెయిర్‌‌‌‌సెలూన్ గేమ్‌‌, ఫర్‌‌‌‌ ఇన్‌‌స్టెన్స్‌‌ లాంటి గేమ్స్‌‌ డౌన్‌‌లోడ్‌‌ 314 శాతం పెరిగిందని యాప్స్‌‌ రూపొందించిన సంస్థలు  చెప్తున్నాయి. “ ‘హై హీల్స్‌‌!’ యాప్‌‌కు మంచి క్రేజ్‌‌ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నారు. అన్ని దేశాల్లో కంటే ఇండియా టాప్‌‌లో ఉంది” అన్నారు గేమ్‌‌ను క్రియేట్‌‌ చేసిన రోలిక్‌‌ కంపెనీ సీఈవో బురాక్‌‌ వర్దాల్‌‌. వెరైటీ డిజైన్స్‌లో హీల్స్‌ తయారు చేయడం, నెయిల్‌ పాలిష్ డిజైన్‌ చేసే యాప్స్‌ కూడా చాలానే ఉన్నాయి.
సోషల్‌‌ మీడియా ట్రెండ్స్‌‌
ఈ ఆటల్ని ఆడి వదిలేయటం లేదు. గేమ్స్‌‌లో వాళ్లు చేసిన హెయిర్‌‌‌‌స్టైల్స్‌‌, నెయిల్‌‌ ఆర్ట్స్‌‌కు సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్‌‌మీడియాలో షేర్‌‌‌‌ చేయడం తో అవి భలే ట్రెండ్‌‌ అయ్యాయి. ఈ మధ్య కాలంలో చాలామంది నెయిల్‌‌ ఆర్ట్స్‌‌కు సంబంధించి వీడియోలు పెట్టడంతో క్రేజీ ల్యాబ్స్‌‌కు  చెందిన ‘అక్రిలిక్‌‌ నెయిల్స్‌‌!’ (Acrylic Nails!) యాప్‌‌ పాపులర్‌‌‌‌ అయ్యింది. అలా చాలా యాప్స్‌‌ సోషల్‌‌ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాయి. 

“హైపర్‌‌‌‌ – క్యాజువల్‌‌ గేమ్‌‌ సెగ్మెంట్‌‌కు ఇప్పుడు చాలా పాపులారిటీ ఉంది. తక్కువ టైంలో, ఈజీగా ఆడొచ్చు అందుకే క్రేజ్‌‌ ఎక్కువ. ఫ్యాషన్స్‌‌ గేమ్స్‌‌ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఫ్యాషన్‌‌ గేమ్స్‌‌ ట్రెండ్‌‌ బాగా పెరిగిపోయింది. ఆ గేమ్స్‌‌ గేమింగ్‌‌ మేక్‌‌ఓవర్‌‌‌‌నే మార్చేశాయి. అందరూ ఆ గేమ్స్‌‌ను క్రియేట్‌‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ” – స్టీఫెనీ చాన్‌‌, సెన్సర్‌‌‌‌ టవర్స్‌‌ మొబైల్‌‌ ఇన్‌‌సైట్స్‌‌ స్ట్రాటజిస్ట్‌‌.