కశ్మీర్ లేటెస్ట్ అప్ డేట్స్

కశ్మీర్ లేటెస్ట్ అప్ డేట్స్
  • జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్ లోని అన్ని ప్రాంతాల్లో ఆఫీసులు మొదలవుతాయని అన్నారు. ప్రైమరీ స్కూల్స్ సహా…. అన్ని విద్యాసంస్థలను ఒకేసారి తెరవాలన్న ఆలోచనతో తాము ఉన్నట్టు కశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి ఘర్షణ, గొడవ లాంటి సంఘటనలు జరగలేదన్నారు. గ్రామీణ ప్రాంతాలనుంచి.. పట్టణ ప్రాంతాలకు ప్రజారవాణా ఇబ్బందిలేకుండా జరుగుతోందని చెప్పారు రోహిత్ కన్సాల్.

  • జమ్ముకశ్మీర్ లోని కిష్ట్ వార్ ఏరియాలో 144 సెక్షన్ ను తొలగించారు భధ్రతాధికారులు. బందోబస్తు పెంచి.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • ఐక్యరాజ్యసమితి భధ్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని చర్చించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు లడఖ్ ఎంపీ జామ్యాంగ్ త్సెరింగ్ నంగ్యాల్. ప్రధాని మోడీ నిర్ణయాన్ని సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నామన్నారు. “కశ్మీర్ మన ప్రాంతం కాబట్టే.. నిర్ణయం కూడా మనదే. పొరుగు దేశానికి కశ్మీర్ తో సమస్య ఉంటే దానికి మనం ఏం చేయలేం. సమస్యను రెండు దేశాలు కలిసి మాట్లాడుకుంటాయి. కానీ… కశ్మీర్ పై నిర్ణయం మాత్రం కాదు. ఆ నిర్ణయం ఇండియాకు సంబంధించినది మాత్రమే” అని నంగ్యాల్ చెప్పారు. కశ్మీర్ పై మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం .. గత ప్రభుత్వాలు ఎప్పుడో తీసుకోవాల్సిందన్నారు నంగ్యాల్.

  • పాకిస్థాన్ లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. కశ్మీర్ స్ట్రాటజీపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీతో సమావేశం అయ్యారు.ఈ కమిటీని ఇమ్రాన్ ఖానే ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ నాయకత్వం వహిస్తున్నారు. కశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల స్పందనను ఈ సమావేశంలో రివ్యూ చేశారు ఇమ్రాన్ ఖాన్.