ఎగ్జామ్స్ కు లాఫింగ్ ‘మెడిసిన్’

ఎగ్జామ్స్ కు లాఫింగ్ ‘మెడిసిన్’

ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ భయపడిపోతుంటారు. ఎప్పుడూ లేని ఒత్తిడికి గురవుతుంటారు. ప్రిపరేషన్ కోసం హడావుడి పడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది స్టూడెంట్లు సమస్యలు ఎదుర్కొంటుంటారు. కొంతమంది ఎగ్జామ్ సెంటర్ కు లేట్ గా వెళ్లడం… పెన్నులు, పెన్సిళ్లు మరిచిపోవడం చేస్తుంటారు. వీటన్నింటికీ ‘‘లాఫింగ్” మెడిసిన్ ఇస్తోంది సీబీఎస్ఈ. ఎగ్జామ్స్ విషయంలో స్టూడెంట్లను భయం విడిచిపెట్టేలా   ప్రోత్సహిస్తోంది. నవ్వును తెప్పించే మీమ్స్ రూపంలోనే స్టూడెంట్లకు ఎగ్జామ్ రూల్స్  పై అవగాహన కల్పిస్తోంది. ఇవి ఫన్నీగా ఉండడంతో పాటు అవసరమైన సమాచారం స్టూడెంట్లకు చేరుతుండడం విశేషం. సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ స్టూడెంట్ల ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి సీబీఎస్ఈ సోషల్ మీడియా రోజుకో క్రియేటివ్ పోస్టు పెడుతోంది. స్కూల్ చిల్డ్రన్స్ ఇనిస్పిరేషన్ తోనే తనకీ ఐడియా వచ్చిందని సీబీఎస్ఈ బోర్డు చైర్ పర్సన్ అనితా కర్వాల్ చెప్పారు.

అదిరిపోయిన మీమ్స్..

సీబీఎస్ఈ ఇటీవల పోస్టు చేసిన కొన్ని మీమ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఎగ్జామ్ సెంటర్ కు ఉదయం 10 గంటల తర్వాత అనుమతించబోమని స్టూడెంట్లకు చెప్పేందుకు ఒక క్రియేటివ్ పోస్టు పెట్టింది. ‘‘పింపుల్స్ జీరో… బ్లాక్ హెడ్స్ జీరో… ఎంట్రీ ఆలోవ్డ్ ఆఫ్టర్ 10 ఏఎం జీరో” అనే ఫొటో క్యాప్షన్లతో మీమ్ ను రూపొందించింది. అదే విధంగా ఎగ్జామ్స్ కు బ్లూ/బాల్ పాయింట్ పెన్నులు తెచ్చుకోవాలని సూచిస్తూ… ‘‘పరీక్షలు బ్లూ/బాల్ పాయింట్ పెన్స్ తోనే రాయాలి. జెల్ పెన్స్ తోనూ రాయొచ్చు. ఇక ఇప్పుడు ఎవరూ ‘మాకు దీనిపై ఐడియా లేదని చెప్పరు” అని పోస్ట్ చేసింది.