హైదరాబాద్, వెలుగు : మనదేశంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్)పై సదస్సును 'ఏఐ డేస్ 2024' పేరుతో శనివారం హైదరాబాద్‌లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘స్వేచ్ఛ’ నిర్వహించింది. ఈ రెండు రోజుల సదస్సులో వేల మందికి పైగా ఐటీ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విద్యార్థులతో పాటు ఏఐ, ఎంఎల్ నిపుణులు పాల్గొన్నారు. ఈ సదస్సుతో హైదరాబాద్ ఏఐ రాజధానిగా మారేందుకు మార్గం సుగమం అవుతుందని స్వేచ్ఛ తెలిపింది. ఈ సమావేశంలో ఏఐ పాలన, విధానపరమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
