
నాగర్ కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రం చెరువులో బుధవారం లాంచీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి లాంచీలో షికారుకు చేశారు. పండుగ కావడంతో లాంచీలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. లాంచీలో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నట్లు టూరిజం ఆఫీసర్లు తెలిపారు. - నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు